Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భూసేకరణ' బిల్లు ఆమోదం కోసం ఉభయసభల సమావేశం!

అత్యంత కీలకమైన భూసేకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేకపోతే, ఉభయసభలనూ ఒకేసారి సమావేశపరచాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. అయితే, ఆ పరిస్థితి రాదనే భావిస్తున్నట్టు జైట్లీ తెలియజేశారు. రాజ్యసభలోనే బిల్లుకు ఆమోదం లభిస్తుందని భావిస్తున్నామని జైట్లీ అన్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ఆయన, 'ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్' పేరిట ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూసేకరణ బిల్లు భారత భవిష్యత్తుకు అత్యంత కీలకమని వ్యాఖ్యానించిన ఆయన భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, బిల్లు ఆమోదానికి రాజ్యసభలో తమకు తగినంత బలం లేదని అంగీకరించిన ఆయన, విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News